TS Inter exam Hall tickets: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

Telangana inter exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు వేళైంది. మార్చి 15 నుంచే పరీక్షలు ప్రారంభం కానున్న వేళ తెలంగాణ ఇంటర్‌బోర్డు హాల్‌ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

Updated : 14 Mar 2023 15:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు(Inter board) పరీక్ష హాల్‌ టిక్కెట్ల (exam hall tickets)ను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ http://tsbie.cgg.gov.in/ నుంచి విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.  ఎస్‌ఎస్‌సీ హాల్‌ టిక్కెట్‌; పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఇంటర్‌ మొదటి సంవత్సర హాల్‌ టిక్కెట్లు పొందొచ్చు. అలాగే, గతేడాది పరీక్ష రాసిన హాల్‌టిక్కెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు తమ పరీక్ష హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 

ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్‌బోర్డు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వరకు ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు జరగనుండగా.. మార్చి 16  నుంచి ఏప్రిల్‌ 4వరకు ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌ టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ హాల్‌ టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని