రేపు టీఎస్‌ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. 29-07-2020 నుంచి ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన

Updated : 28 Jul 2020 18:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్‌ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు 71,298 జవాబు స్క్రిప్టులే తిరిగి ధ్రువీకరించామని, మిగతా 1,198 జవాబు స్క్రిప్టులు నెలాఖరుకి పూర్తవుతాయని తెలిపింది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటనలో ఇంటర్‌బోర్డు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని