TS Lawcet: లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ లాసెట్, పీజీఎల్‌ సెట్ షెడ్యూల్‌ విడుదలైంది. దీనికి సంబంధించి మార్చి 1న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.

Updated : 27 Feb 2023 18:19 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లాసెట్‌(TS Lawcet) , పీజీఎల్‌ సెట్‌ (PGLCET) షెడ్యూల్‌ ఖరారైంది. మార్చి 1న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవిందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 6 వరకు లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవచ్చని అధికారులు సూచించారు.

ఈసెట్ షెడ్యూల్‌ ఇదే..

అదే విధంగా ఈసెట్ షెడ్యూల్‌నూ అధికారులు ఖరారు చేశారు. మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 15 నుంచి హాల్‌టికెట్లు జారీ చేసి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని