Telangana News: ప్రతి దానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోంది: మంత్రి జగదీశ్‌రెడ్డి

నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంలో అర్ధం లేదని  తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. సాగర్‌ జలాలను ఉపయోగించి

Updated : 06 Apr 2022 06:25 IST

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంలో అర్ధం లేదని  తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. సాగర్‌ జలాలను ఉపయోగించి తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందనడంలో నిజం లేదన్నారు. అసంబద్ధ ఆరోపణలతో ఏపీ తన గౌరవం దిగజార్చుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సాగర్‌ నుంచి ఎక్కువగా తాగునీటి అవసరాలు ఉన్నాయని వెల్లడించారు. పవర్‌ గ్రిడ్‌ను కాపాడుకునేందుకు ఐదు పది నిమిషాలు మించి నీటిని వినియోగించుకోలేదని వివరణ ఇచ్చారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి ఆపేసినా.. ఏపీ ఇప్పటికీ  విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు.  తామెప్పుడూ ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదని, ప్రతిదానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని