TS Secretariat: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం.. కొత్త తేదీ ఖరారు
తెలంగాణ నూతన సచివాలయ భవనం (TS Secretariat) ప్రారంభోత్సవానికి కొత్త తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న దీన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ భవనం (TS Secretariat) ప్రారంభోత్సవానికి కొత్త తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న దీన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బి.ఆర్. అంబేడ్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17నే సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో తాజాగా కొత్త తేదీని నిర్ణయించారు. మరోవైపు జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు.
పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
నూతన సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ (CM KCR) పరిశీలించారు. నిర్మాణ భవనం చుట్టూ కలియ తిరుగుతూ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?