సరిహద్దు వద్ద ఏపీ కొవిడ్‌ అంబులెన్స్‌లు అడ్డగింత

ఏపీ నుంచి వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు.

Updated : 10 May 2021 18:57 IST

అనుమతి లేదంటున్న తెలంగాణ  పోలీసులు

కోదాడ: ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు.

ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని.. మరోవైపు హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్‌ లేవని పోలీసులు చెబుతున్నారు. పుల్లూరు టోల్‌గేట్‌ వద్దకు కర్నూలు పోలీసులు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. ఆస్పత్రుల హామీతో అంబులెన్స్‌లను తెలంగాణలోకి విడిచిపెడుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని