Telangana News: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదల

తెలంగాణలో నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని పోలీసు నియామక మండలి.....

Updated : 30 Aug 2022 18:59 IST

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. కీ పేపర్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా కోరింది. ఈ నెల 31న ఉదయం 8గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పోలీసు నియామక మండలి సూచించింది. 

   ‘KEY’ కోసం క్లిక్‌ చేయండి   

తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల ప్రాథమిక రాత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన విషయం తెలిసిందే.పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని