TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ

పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Published : 30 Jan 2023 19:57 IST

హైదరాబాద్‌: ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్‌ 25న వ్యవసాయ అధికారి నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 7న డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష, మే 13న పాలిటెక్నిక్‌ లెక్చరర్ల నియామక పరీక్ష, మే 17న ఇంటర్‌, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని