TSPSC Jobs: ఉద్యోగాల భర్తీ విధానంపై ఉత్తర్వులు.. పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

Tspsc jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 25 Apr 2022 19:51 IST

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రూప్-1 పోస్టులకు 900, గ్రూప్‌-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-3లోని 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాత పరీక్ష జరుగుతుంది. గ్రూప్‌-4లోని జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహంచనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాటే గ్రూప్స్ విభాగంలో భర్తీ కానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

గ్రూప్స్‌తో పాటు గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, సూపర్‌వైజర్, అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ రిపోర్టర్‌, ఇంగ్లీష్‌ రిపోర్టర్‌ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానాలను ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని