TSPSC: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌...

Published : 07 Sep 2022 18:48 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి ఈ నెల 5న టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts