అలాంటి OMRషీట్ల మూల్యాంకనం అక్కర్లేదు: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ ఓఎంఆర్‌ పత్రాల్లో బబ్లింగ్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్‌ .....

Updated : 19 Jul 2021 17:40 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఓఎంఆర్‌ పత్రాల్లో బబ్లింగ్‌ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్‌ పత్రాల్లో బబ్లింగ్‌లో పొరపాట్లపై విచారణ సోమవారం జరిగింది. బబ్లింగ్‌లో తప్పులు ఉన్న సమాధాన పత్రాలను అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది. బబ్లింగ్‌లో తప్పులు చేసిన వారి ఓఎంఆర్‌ షీట్ల మూల్యాంకనం అక్కర్లేదని స్పష్టంచేసింది. వివరాలను జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులేదేనని తేల్చి చెప్పింది.  కోర్టు కేసులతో ఆగిన నియామకాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. 40 నుంచి 60 పోస్టులు భర్తీ కాకుండా మిగిలాయని టీఎస్‌పీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలపగా.. మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీకి న్యాయస్థానం అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని