TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుల జాబితా.. సిద్ధం చేసిన సిట్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన వారి జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేశారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన వారి జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేశారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు నుంచి అభ్యర్థుల సమాచారం సేకరించిన అధికారులు.. సిట్ కార్యాలయానికి రావాలని వారికి సూచించారు. ఆయా అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విచారణకు వచ్చిన అభ్యర్థుల నుంచి 15 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.
బయోడేటా ఆధారంగా ఎంతవరకు చదివారు? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? తదితర అంశాలను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. గతంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసి ఉంటే వాటి సమాచారం కూడా తీసుకుంటున్నారు. సమాచారం అనంతరం తిరిగి సంప్రదిస్తామని అభ్యర్థులకు సిట్ అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం