TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు

సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలను సిట్‌ గుర్తించింది.

Published : 31 Mar 2023 13:58 IST

హైదరాబాద్‌: సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలను సిట్‌ గుర్తించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ - ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ - డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ - ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు - ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2  - టౌన్ ప్లానింగ్ - జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది.

ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ  పరిణామం చోటుచేసుకోనుండటం గమనార్హం. అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని