TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు

తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది.

Updated : 10 Jun 2023 19:11 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు. వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు’’ అని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని