TSRJC CET: టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు చేశారా? మార్చి 31 లాస్ట్!
రాష్ట్రంలోని 35 జూనియర్ గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తులకు గడువు సమీపిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలోని 35 జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు(TSRJC-CET – 2023) దరఖాస్తుల గడువు సమీపిస్తోంది. గురుకుల విద్యాలయాల సంస్థ జారీ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులకు మార్చి 31తో గడువు ముగియనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ.200గా ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మే 1 నుంచి 5వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
పరీక్ష కేంద్రాలివే..
ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు వీటిలో ఏ కేంద్రాన్నైనా ఎంచుకోవచ్చు. పరీక్ష పేపర్ తెలుగు/ఆంగ్లంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ రూపంలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష 150 మార్కులకు, రెండున్నర గంటల పాటు ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
AC Blast: ఇంట్లో ఏసీ పేలి మహిళా ఉద్యోగి మృతి
-
Ap-top-news News
Nellore: అధికారుల తీరుకు నిరసనగా.. చెప్పుతో కొట్టుకున్న సర్పంచి
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
Crime News
ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టంతో సొమ్మసిల్లి పడిపోయిన యజమాని
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ