TSRTC: ‘‘అయయ్యో.. వద్దమ్మా.. సుఖీభవ!’’ టీఎస్‌ఆర్టీసీ వీడియో చూశారా?

: ఏదైనా సరే.. రొటీన్‌కి భిన్నంగా ఉంటేనే కదా..! అది జనాలకు చేరువయ్యేది. ట్రెండ్‌ని ఫాలో అయితేనే కదా.. క్లిక్‌ అయ్యేది. సరిగ్గా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది టీఎస్‌ఆర్టీసీ. ఓ టీ పొడి సంస్థ యాడ్‌ను ఆధారంగా చేసుకొని గణేశ్‌ ఉత్సవాల్లో ఓ యువకుడు చేసిన ‘‘సుఖీభవ.. సుఖీభవ’’ డ్యాన్స్‌  వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Published : 14 Oct 2021 02:14 IST

 దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో
ట్విటర్‌లో షేర్‌ చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ 

హైదరాబాద్‌: ఏదైనా సరే.. రొటీన్‌కి భిన్నంగా ఉంటేనే కదా..! అది జనాలకు చేరువయ్యేది. ట్రెండ్‌ని ఫాలో అయితేనే కదా.. క్లిక్‌ అయ్యేది. సరిగ్గా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది టీఎస్‌ఆర్టీసీ. ఓ తేయాకు పొడి సంస్థ యాడ్‌ను ఆధారంగా చేసుకొని గణేశ్‌ ఉత్సవాల్లో ఓ యువకుడు చేసిన ‘‘సుఖీభవ.. సుఖీభవ’’ డ్యాన్స్‌  వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ట్రెండ్‌ని టీఎస్‌ఆర్టీసీ అనుసరించింది. దసరా సీజన్‌ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ‘‘సుఖీభవ’’ స్టైల్‌లో ఓ యాడ్‌ రూపొందించగా... టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ ఓ వ్యక్తి తమ్మీ.. నేను జీపులో ఊరికి పోతున్నా అంటే... మధ్యలో యువకులు అతడిని ఆపి.. అయ్యయ్యో వద్దన్నా.. పక్కనే ఆర్టీసీ బస్‌ఉంది. క్షేమంగా వెళ్లొచ్చు. డబ్బులెక్కువ తీసుకోరు .. సుఖీభవ సుఖీభవ’’ అంటూ తీన్మార్‌ డప్పులకు చిందేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం, సుఖమయం, శుభప్రదం’’అంటూ చివర్లో సజ్జనార్‌ టీఎస్‌ఆర్టీసీ భద్రత గురించి తెలియజేశారు. ఇక ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. సజ్జనార్‌ సర్‌! ఏ పదవి చేపట్టినా సరే! తనదైన శైలిలో ముద్రవేస్తారంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని