TSRTC: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ఛార్జీల మోత

తెలంగాణ ఆర్టీసీ(టీఎస్‌ఆర్టీసీ) బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో

Updated : 28 Mar 2022 09:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ(టీఎస్‌ఆర్టీసీ) బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున.. సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10వరకు టికెట్‌ రేట్లు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. మరోవైపు అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల రౌండప్‌ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్న ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ రేట్లను రౌండప్‌ చేసినట్లు తెలిపింది. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని