
TSRTC: అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 3,400, జేబీఎస్ నుంచి 1,200 రెగ్యులర్ బస్సులు నడుపుతుండగా.. పండుగ వేళ అదనంగా మరో 4,322 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణకు 3,338, ఆంధ్రప్రదేశ్‌కు 984 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ బస్సుల నిర్వహణకు 200 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. ప్రజలందరూ ఈ వెసలుబాటును ఉపయోగించుకోవాలని సజ్జనార్ కోరారు. బస్సుల గురించి సమాచారం కోసం ఎంజీబీఎస్‌కి 9959226257, జేబీఎస్‌కి 9959226246 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని ఆయన ట్వీట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.