TSRTC: మ‌ద‌ర్స్ డే స్పెషల్‌.. మాతృమూర్తులకు టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్‌ ప్రకటించింది. మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల్లో మాతృమూర్తులకు

Published : 07 May 2022 01:40 IST

హైదరాబాద్: మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్‌ ప్రకటించింది. మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులు మాత్రమే అన్ని బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమ‌ను వెల‌కట్టలేమని.. ఆ త్యాగ‌మూర్తి సేవ‌ల‌కు గుర్తింపుగా మ‌ద‌ర్స్ డేని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని క‌ల్పించినట్లు చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులంద‌రూ ప‌ల్లె వెలుగు నుంచి ఏసీ స‌ర్వీసుల వ‌ర‌కు అన్ని బ‌స్సుల్లో ఈనెల 8వ తేదీన ఈ ఉచిత ప్రయాణాన్ని కొన‌సాగించ‌వచ్చని వారు స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని