TSRTC: వసంత పంచమికి 108 ప్రత్యేక బస్సులు.. వివరాలివే..

ఈ నెల 26న వసంత పంచమి రోజు ప్రత్యేక బస్సులు నడపాలని  టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. బాసర, వర్గల్‌ పుణ్యక్షేత్రాలకు మొత్తంగా 108 బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Published : 24 Jan 2023 18:52 IST

హైదరాబాద్‌: వసంత పంచమి(Vasantha Panchami)కి ప్రత్యేక బస్సులు(special buses) నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేసేందుకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 26న బాసర(Basara), వర్గల్‌(wargal)కు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్టు టీఎస్‌ ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌(VC sajjanar) వెల్లడించారు. మొత్తంగా 108 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. వీటిలో నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లా వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ట్విటర్‌లో తెలిపారు. ఆయా ప్రత్యేక బస్సులు ఎక్కడి నుంచి బయల్దేరుతాయి? ఛార్జీలు వంటి వివరాలను ఆయన షేర్‌ చేశారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఏటా వసంత పంచమి రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనం అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరుతుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని