TSRTC: టికెట్‌తో పాటు ‘స్నాక్ బాక్స్’.. టీఎస్‌ఆర్‌టీసీ వినూత్న ఆలోచన
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు బస్ టికెట్‌తో పాటు ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని టీఎస్‌ఆర్‌టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏసీ సర్వీసుల్లో ఇప్పటికే వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ - విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని శనివారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది.
స్నాక్ బాక్స్‌లో ఏముంటాయ్..
టీఎస్ఆర్‌టీసీ అందించే స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లు, మౌత్ ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులెవరూ ఆర్టీసీ సిబ్బందికి స్నాక్ బాక్స్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ విధానాన్నీ అలాగే ఆదరిస్తారని..: సజ్జనార్
‘‘ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్‌ఆర్‌టీసీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికులకు ‘స్నాక్ బాక్స్’ ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలతో స్నాక్ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది. టీఎస్‌ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకొచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానాన్నీ అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్..
ప్రతి స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సజ్జనార్ సూచించారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకొని స్నాక్ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను ఆధారంగా చేసుకొనే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి