TSRTC: గణేశ్‌ నిమజ్జనానికి 535 ప్రత్యేక బస్సులు.. వివరాలివే..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈనెల 28న జరగనున్న గణేశ్‌ నిమజ్జనోత్సవానికి భారీగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

Published : 26 Sep 2023 16:20 IST

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భారీగా బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. వినాయక నిమజ్జనం వేళ భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు.

గణేశ్‌ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్‌ ఇవే..!

వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ సంస్థ అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని