TS SET: టీఎస్‌సెట్‌ పరీక్ష తేదీ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఇదే..

తెలంగాణలో ఉపాధ్యాయ ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన టీఎస్‌ సెట్‌ పరీక్షను మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించారు.

Updated : 07 Mar 2023 17:14 IST

హైదరాబాద్‌:  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌)-2022  తేదీలను రీషెడ్యూల్‌ చేశారు. దీని ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న (శుక్రవారం) నిర్వహించాలని నిర్ణయించారు.  14, 15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు టీఎస్‌ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ సి.మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్‌ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.  

రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ సెట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయం చూస్తోంది. ఈ పరీక్షకు డిసెంబ‌రు 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కంప్యూటర్‌ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే టీఎస్‌ సెట్‌కు రెండు పేపర్లు ఉంటాయి. పూర్తి వివరాలను www.telanganaset.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని