Telangana News: జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్‌

తెలంగాణలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు చేశారు. 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించగా.. 181 మంది అభ్యర్థులు మాల్‌

Published : 25 Aug 2022 16:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు చేశారు. 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించగా.. 181 మంది అభ్యర్థులు మాల్‌ ప్రాక్టీస్‌ పాల్పడినట్లు హైదరాబాద్‌, రాచకొండ పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ఘట్‌కేసర్‌ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి చరవాణితో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమకు సమాధానాలు చెబుతామని రూ.లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్థి అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.  ఈ కేసులో ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ విషయంపై టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి స్పందిస్తూ.. మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిన నేపథ్యంలో గతంలో నిర్వహించిన జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్షను రద్దు చేశామని.. త్వరలో కొత్త నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని