TSWRES: తెలంగాణ గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

కరీంనగర్‌ జిల్లాలోని రుక్మాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 15వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి  రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 18:56 IST

హైదరాబాద్‌: మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో అధికారుల నియామక ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.  బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు, ఇంటర్‌లో సీట్ల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నేటి (జనవరి 31) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఆరోతరగతిలో (80 సీట్లు), ఇంటర్‌లో‌(ఎంపీసీ- 80 సీట్లు) ప్రవేశాలకు అర్హులైన బాలురు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఫిబ్రవరి 26న ఉంటుంది.  దరఖాస్తు చేసుకొనేందుకు https://www.tswreis.ac.in/ లింక్‌పై క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తులు ప్రారంభం: జనవరి 31, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆఖరి గడువు ఫిబ్రవరి 15
  • హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ ఫిబ్రవరి 17
  • రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి 26
  • రాతపరీక్ష ఫలితాలు విడుదల మార్చి 8
  • ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష: మార్చి 10, 12, 14, 18,19
  • తుది ఫలితాలు వెల్లడి: మార్చి 28
  • అడ్మిషన్లు ప్రారంభం: మార్చి 30 నుంచి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు