TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం... తితిదే పాలకమండలి కీలక నిర్ణయాలివే

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణకానుకలతో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Published : 01 Dec 2022 01:18 IST

తిరుమల: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలకమండలి సమావేశం బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా  గతేడాది నిర్వహించినట్లు 10రోజుల పాటు ఆలయ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించినట్టు చెప్పారు.

తితిదే పాలకమండలి నిర్ణయాలు..

తిరుపతి స్థానికులకు పలు ప్రదేశాల్లో దర్శన కౌంటర్ల ఏర్పాటు.

* సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు.

నందకం అతిథి గృహంలో ఫర్నిచర్ల మార్పునకు రూ.2.95 కోట్లు.

* రెండో కనుమదారిలో రక్షణ గోడలకు రూ.9కోట్లతో ఆమోదం.

* తిరుమల స్థానిక బాలాజీనగర్‌లో డ్రైనేజీ పనులకు రూ.3.70 కోట్లు మంజూరు.

* జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న ఆలయ ఘాట్‌రోడ్డు నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం అభివృధ్ధి పనులకు రూ.7కోట్లు కేటాయింపు.

* జనవరి 2న శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి. గతంలో మాదిరిగా 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం.

* 10 రోజులకు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ.

* జనవరి 2న రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తేనే  బ్రేక్‌ దర్శనం.

* టోకెన్లు పూర్తయ్యే వరకు తిరుపతిలో కౌంటర్లు తెరిచే ఉంటాయి.

* వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున పదిరోజులకు 2.5లక్షల రూ.300ల దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో కేటాయింపు.

* ఆనంద నిలయం బంగారు తాపడం పనులకోసం ఫిబ్రవరి 23న బాలాలయం నిర్వహించాలని ముహూర్తం ఖరారు.

* శ్రీవారి మూలవిరాట్‌కు నిత్య సేవల నిర్వహణ, భక్తుల దర్శనం యథావిధిగా కొనసాగుతుంది.

* 1957, 1958లో జరిగినట్టే భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణకానుకలతో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం.

* శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం 331 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 1100 పైగా ఆలయాలను త్వరితగతిన నిర్మాణాలు చేయాలని నిర్ణయం.

* తితిదే ఆసుపత్రుల్లో ఔషదాలు, సర్జికల్ పరికరాలు కొనుగోలుకు రూ.2.86 కోట్లు.

* లడ్డూ కౌంటర్లలో భారీ అవకతవకలకు పాల్పడిన కేవీఎం సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

* కేవీఎమ్ సంస్థ కాంట్రాక్ట్ ను రద్దు చేసి, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి ఆరెస్ట్ చేయాలని నిర్ణయం

* ఉద్యోగులు, కార్పోరేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులతో లడ్డూ కౌంటర్ల నిర్వహణ. 

* రూ.17,500 జీతం, వసతి సదుపాయం కల్పించి, కొత్త సిబ్బందిని కార్పోరేషన్ ద్వారా నియమించుకోవాలని నిర్ణయం.

* తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు రూ.3.75 కోట్లు మంజూరు

* తితిదేలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి బ్రహ్మోత్సవాల బహుమానం.

* తితిదేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలపై కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తితిదే పాలకమండలి ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని