TTD: తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు

తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు.

Published : 30 Jun 2024 13:53 IST

తిరుమల: తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరిగాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ తీర్మానాలు భక్తులకు తెలిసేలా తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని