TTD: నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు.. తితిదే ఛైర్మన్‌

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.

Updated : 27 Mar 2023 16:10 IST

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. కరోనాకు ముందు నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను తితిదే జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో వీటిని నిలిపివేసిన తితిదే.. తాజాగా మళ్లీ నడిచి వచ్చే భక్తుల కోసం దివ్యదర్శన టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని