TTD: 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యిమందికి శ్రీవారి దర్శనం: తితిదే ఛైర్మన్‌

తిరుమల బ్రహ్మోత్సవాలపై తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి బుధవారం  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రేపు సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏపీలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తాం. రేపటి నుంచి 15వరకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం...

Updated : 06 Oct 2021 18:48 IST

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాలపై తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి బుధవారం  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రేపు సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏపీలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తాం. రేపటి నుంచి 15వరకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఉచిత రవాణా, దర్శన ఏర్పాట్లు చేశాం. భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధ్రువపత్రంతో రావాలి. కరోనా వల్ల ఏకాంతంగా బ్రహ్మోత్సవాల నిర్వహిస్తున్నాం. ఆలయ కల్యాణ మండపంలోనే వాహన సేవల నిర్వహణ. ఆగమోక్తంగా అన్ని వైదిక ఆకర్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఈనెల 15న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈనెల 12 నుంచి చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. నెల రోజుల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. బర్డ్‌ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధి. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానెళ్లు సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. ఛానెల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొంటారు’’ అని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని