TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం: వై.వి.సుబ్బారెడ్డి

రెండు సంవత్సరాల తర్వాత భక్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్‌లో ...

Published : 04 Aug 2022 22:38 IST

తిరుమల: రెండు సంవత్సరాల తర్వాత భక్తుల మధ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే, జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే అమలు చేస్తామన్నారు. 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళులు పవిత్రంగా భావించే పెరటాసి మాసం.. బ్రహ్మోత్సవాల సమయంలో ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల బస కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు కొవిడ్‌ ప్రొటో కాల్‌ పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని