- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలు
పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన తితిదే ఛైర్మన్
తిరుమల: శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. వచ్చే 18 నెలల్లోనే కశ్మీర్‌లో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వారణాసి, బాంబేలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తితిదే పరిధిలో ఉన్న ప్రతి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 100 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.
‘‘ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో నిరంతరాయంగా స్వామివారిని నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రైతులతో మాట్లాడి సహజ పంటలపై త్వరలోనే చర్చిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు వీలుగా ఒక నూతన విధానాన్ని తీసుకురాబోతున్నాం. వచ్చే 90 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ముసాయిదా రూపొందిస్తాం. ఇప్పటికే వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సర్వీస్, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని రెగ్యులర్ చేసేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఉద్యోగిని తితిదే పరిధిలో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తాం’’ అని సుబ్బారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Kapil Dev: వన్డే, టెస్టు ఫార్మాట్లను ఐసీసీ కాపాడాలి: కపిల్‌దేవ్
-
India News
Jammu and Kashmir: నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి
-
India News
‘వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. నేను బెయిల్ ఇప్పిస్తా’
-
Movies News
Highway: ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్.. కొత్త లుక్‌లో ఆనంద్ దేవరకొండ
-
General News
TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
-
General News
Telangana News: సామూహిక ‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు