TTD News: కొవిడ్‌ తగ్గితే... ఈ నెల 15 తర్వాత సర్వదర్శనం టోకెన్లు: తితిదే ఈవో

కొవిడ్‌ తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. తితిదే ఉన్నతాధికారులతో ఈవో జవహర్‌రెడ్డి సమీక్షించారు

Published : 05 Feb 2022 02:22 IST

తిరుమల: కొవిడ్‌ తగ్గితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. తితిదే ఉన్నతాధికారులతో ఈవో జవహర్‌రెడ్డి సమీక్షించారు. కరోనా తగ్గితే మార్చి 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి ఇస్తామని చెప్పారు. దర్శన టికెట్లు అమ్మే నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగిస్తున్నామని వివరించారు. నకిలీ వెబ్‌సైట్ల కట్టడికి తితిదే సైబర్‌ విభాగం నిరంతర నిఘా పెడుతున్నట్లు తెలిపారు. తితిదే అధికారిక వెబ్‌సైట్‌లోనే భక్తులు టికెట్లు పొందాలని సూచించారు. తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికత తీసుకొస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని