TTD: తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు: ఈవో
తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం తితిదే పరిపాలన భవనంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో వివిధశాఖల అధికారులు, తితిదే అధికారులతో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- డౌన్ ఘాట్ రోడ్డులో ఒకటో మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేటు, అప్ ఘాట్‌రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి.
- అప్ ఘాట్‌రోడ్‌లో మాదిరిగా డౌన్ ఘాట్ రోడ్‌లో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మించాలి.
- ఏ రకమైన వాహనాలు ఘాట్ రోడ్డులో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలి.
- ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు విరివిగా ఏర్పాటు చేయాలి.
- ఘాట్ రోడ్లలో స్పీడ్ లిమిట్ ఎంత? డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకంపై నిషేధం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపేలా నిరంతరం కరపత్రాలు పంపిణీ చేయాలి.
- ఘాట్ రోడ్లలో వాహనాల వేగాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలి.
- అంబులెన్స్‌లు, రెస్క్యూ టీమ్‌లు అవసరమైన పరికరాలతో సదా సన్నద్ధంగా ఉండాలి.
- ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ బస్సుల్లో ఆడియో టేపులు వినిపించే ఏర్పాటు చేయాలి.
- తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలి.
- ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.
- ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి