TTD: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధర పెంపుపై తితిదే క్లారిటీ

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. 

Published : 22 Jun 2024 17:34 IST

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. తితిదే ధరలను సవరించినట్టు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని తితిదే అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. 

‘‘కొన్ని వాట్సప్‌ గ్రూప్‌లలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చని.. కొంత మంది ఫోన్‌ నెంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్‌ అవుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి తితిదే వెబ్‌సైట్‌ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా కొన్ని టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు  ఎవరైనా టూరిజం శాఖ ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం ఉంది. టూరిజం ద్వారా రావాలనుకునే భక్తులు.. దళారీల ద్వారా కాకుండా నేరుగా ఆయా రాష్ట్ర టూరిజం వెబ్‌సైట్‌ల ద్వారా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. ఈ విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై విజిలెన్స్‌ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని