TTD: సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో బారులు తీరిన స్థానికులు

తితిదే స్థానికులకు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున భారులు ..

Published : 10 Jan 2022 01:59 IST

తిరుపతి: తితిదే స్థానికులకు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. పట్టణంలోని రామచంద్ర పుష్కరిణి, బైరాగపట్టడి, ఎమ్మార్‌పల్లి, మున్సిపల్‌ కార్యాలయం, సత్యనారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9గంటలకు టోకెన్లు జారీ చేస్తామని ముందుగా తితిదే ప్రకటించింది. కానీ, భక్తులు ఆదివారం రాత్రి నుంచే పెద్దఎత్తున తరలి రావడంతో రాత్రి 9గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా భక్తులు భారీఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. రోజుకు 5వేల చొప్పున.. 10 రోజులకు 50వేల టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్ల పంపిణీ రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని