Tirumala: తిరుమలలో రేపటి నుంచి బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమలలో రేపటి నుంచి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 12 Apr 2022 13:40 IST

తిరుమల: తిరుమలలో రేపటి నుంచి బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుమలకు ఇవాళ భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల తర్వాత టోకెన్ల పంపిణీ జరుగుతుండటంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఇవాళ ఒక్క రోజు టోకెన్లు లేకున్నా భక్తులను తిరుమలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

సర్వదర్శన టోకెన్ల పంపిణీ నిలిపివేత..

భక్తుల రద్దీ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత కొవిడ్‌ పూర్వ విధానాన్ని తితిదే పునరుద్ధరించింది. భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతిస్తున్నారు. టోకెన్లు తీసుకున్న వారిని తొలుత.. మధ్యాహ్నం 2గంటల తర్వాత టోకెన్లు తీసుకోని వారందరినీ కంపార్టుమెంట్లలోకి అనుమతించనున్నారు. మరోవైపు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల పంపిణీని నిలిపేసింది. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం జాప్యం అయ్యే అవకాశం ఉందని తితిదే తెలిపింది. భక్తులు సంసిద్ధతతో తిరుమలకు రావాల్సిందిగా కోరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని