Telangana News: ఆ విద్యార్థులకు సువర్ణావకాశం.. TTWR COE సెట్‌కు నేటి నుంచే దరఖాస్తులు!

గిరిజన విద్యార్థుల బంగారు భవితకు బాటలు పరిచే ప్రతిభా కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 12న పరీక్ష (TTWR COE CET-2023) జరగనుంది.

Published : 27 Jan 2023 18:05 IST

హైదరాబాద్‌: గిరిజన విద్యార్థుల బంగారు భవితకు బాటలు పరిచే TTWREIS - సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ‌(ప్రతిభా కళాశాల)ల్లో ఇంటర్‌ (Intermediate) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాబోయే విద్యా సంవత్సరానికి తెలంగాణవ్యాప్తంగా ఉన్న 14 ప్రతిభా కళాశాలల్లో ప్రవేశాలకు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (గురుకులం) జనవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మార్చి 12న జరిగే ఎంట్రన్స్‌ పరీక్ష (TTWR COE CET-2023)లో ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ అందించనున్నట్టు పేర్కొంది. పదో తరగతి పాసైన ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొత్తం 1,140 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధించనున్నారు. ఆయా ప్రతిభా కళాశాలల్లో సీట్ల భర్తీ, పరీక్ష ఫీజు, తదితర పూర్తి వివరాలతో సమగ్ర నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని