
ఇంట్లోనే వేడుకలా.. ఇలా చేయండి..
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ఈ సంవత్సరం మొత్తం చాలా భారంగా గడిచింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు చేసుకోవడం చాలా ప్రమాదకరం. దీని దృష్ట్యా ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిషేధించాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా మన ప్రియమైన వారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటే.. దానికి సరైన వేదిక మన ఇల్లే.. మన ఇంటినే అందంగా అలంకరించి మనకు నచ్చినవారిని ఆహ్వానించి సురక్షితంగా వేడుకలు జరుపుకోవచ్చు. అద్భుతమైన ఆలోచనలతో హౌస్ పార్టీ ఏర్పాటు చేసి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి..
* అందమైన పువ్వులు, సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు, రంగురంగుల రిబ్బన్లతో ఇంటిని అలంకరించండి.
* హౌస్‌పార్టీ కోసం ముందుగా ఒక థీమ్‌ను నిర్ణయించుకోండి. ఏదోక ఇతివృత్తంతో మనం పార్టీకి తయారైతే సగం పని తగ్గినట్లే. దానికి సంబంధించిన అలంకరణ చేస్తే సరిపోతుంది.
* ఇంటిలో పెద్దగా ఉన్న ఓ గది లేదా హాల్లో ఎటువంటి సామగ్రి లేకుండా చేసి ఒక డ్యాన్స్ ఫ్లోర్ ను ఏర్పాటు చేయండి. అద్భుతమైన పార్టీ సాంగ్స్ ఆల్బమ్‌ను దగ్గర పెట్టుకోండి. వినోదాత్మకంగా నృత్యాలు చేస్తూ జ్ఞాపకాలను భద్రపరచుకోండి.
* పాటలు పాడండి. ఆటలు ఆడుకోండి. గ్రూప్‌గా ఆడే ఆసక్తికరమైన ఆటలను ఎంచుకోండి. బోర్డ్ గేమ్స్, ట్రూత్ ఆర్ డేర్ వంటివి మనకు తెలిసినవే.
* చివరిగా ఆటపాటల్లో అలసిపోయిన మీ అతిథుల కోసం సరదాగా ఉండే సినిమానో, వెబ్సిరీస్నో సిద్ధంగా ఉంచుకోండి. కొన్ని చిరుతిళ్లు, కావలసినన్ని మాటలతో మీ వేడుకలు ఉత్సాహంగా, సురక్షితంగా జరుగుతాయి. ఇంకేం ఈ చిట్కాలు పాటించండి నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వానించండి.
ఇవీ చదవండి..
Advertisement