BGMI: బీజీఎంఐలో 25లక్షల ఖాతాలు తొలగింపు

పబ్‌జీ దేశీ వర్షన్‌ ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా(బీజీఎంఐ)’లో తాజాగా 25లక్షలకుపైగా మోసగాళ్ల ఖాతాలను గేమ్‌ను రూపొందించిన క్రాఫ్టన్‌ సంస్థ తొలగించింది. దేశంలో ‘పబ్‌జీ’ నిషేధానికి గురైన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా బీజీఎంఐ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోట్ల మంది యువత

Published : 16 Nov 2021 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్‌జీ దేశీ వర్షన్‌ ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా(బీజీఎంఐ)’లో తాజాగా 25లక్షలకుపైగా మోసగాళ్ల ఖాతాలను గేమ్‌ను రూపొందించిన క్రాఫ్టన్‌ సంస్థ తొలగించింది. దేశంలో ‘పబ్‌జీ’ నిషేధానికి గురైన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా బీజీఎంఐ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోట్ల మంది యువత ఈ గేమ్‌ను ఆడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆటలో మోసాలకు పాల్పడుతున్నారట. గేమ్‌ను హ్యాక్‌ చేసి లేదా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించి శత్రువులను ముందుగానే గుర్తించడం, ఆయుధాలను సేకరించడం వంటివి చేస్తూ తప్పుడు మార్గంలో ఆట గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇలా మోసపూరితంగా ఆడుతున్న వారి ఖాతాలపై గత కొన్ని నెలలుగా క్రాఫ్టన్‌ సంస్థ దృష్టి పెట్టింది. లక్షల సంఖ్యలో ఖాతాలను తొలగిస్తోంది. సెప్టెంబర్‌లో 1.40లక్షల ఖాతాలను తొలగించగా.. అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 10 మధ్య మొత్తం 25,19,262 ఖాతాలపై శాశ్వతంగా, 7,06,319 ఖాతాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. తాజాగా ఈ విషయాన్ని క్రాఫ్టన్‌ సంస్థ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ‘‘బీజీఎంఐలో మోసపూరిత ఖాతాలను క్రాఫ్టన్‌ క్రమం తప్పకుండా తొలగిస్తూనే ఉంది. ఫలితంగా ఇప్పుడు బీజీఎంఐలో అలాంటి ఖాతాలు శూన్యం. ఈ గేమ్‌ సరదాగా ఆడుకోవడానికి మాత్రమే ఉద్దేశించింది. దాన్ని అలాగే కొనసాగించడానికి క్రాఫ్టన్‌ నిరంతరం కృషి చేస్తుంది’’అని సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని