రాష్ట్రాలకు 20 వేల బస్సులు.. తెలంగాణకు దక్కేవెన్నో?

కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు 20వేల బస్సులు అందజేయాలని కేంద్రం తాజా బడ్జెటులో ప్రతిపాదించింది. ప్రభుత్వ-ప్రైవేటు

Published : 02 Feb 2021 20:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు 20వేల బస్సులు అందజేయాలని కేంద్రం తాజా బడ్జెటులో ప్రతిపాదించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో వాటిని కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఉపాధి కల్పనతో పాటు ప్రైవేటు పెట్టుబడిదారులను రవాణా రంగంలో మరింతగా భాగస్వాములను చేసేందుకు ఈ పథకం ఉపకరిస్తుందన్నది కేంద్రం వ్యూహం. ఆ 20వేల బస్సులను ఏయే రాష్ట్రాలకు ఎన్నేసి కేటాయించేదీ, వాటిలో తెలంగాణకు ఎన్ని దక్కేదీ స్పష్టత లేదు. ఫెమా ప్రాజెక్టు కింద కేంద్రం రాష్ట్రాలకు ఇప్పటికే విద్యుత్తు బస్సులను కేటాయించింది. వాటిని ప్రైవేటు సంస్థల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు పేర్కొంది. ఫెమా-2 పథకం కింద కూడా రాష్ట్రానికి బస్సులను కేటాయించినా అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మెతో ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఈ క్రమంలో పథకాన్ని ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లలో వినియోగించుకునేందుకు అవకాశం లేకపోలేదని ఆర్టీసీ అధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఈ బస్సులకు సంబంధించిన విధివిధానాలను కేంద్రం ఖరారు చేస్తే స్పష్టత వస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని