Twitter సేవలకు అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికగా ట్విటర్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం ట్విటర్‌లో లాగిన్‌

Published : 18 Apr 2021 00:50 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికగా ట్విటర్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం ట్విటర్‌లో లాగిన్‌ సమస్య తలెత్తింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ ఖాతాదారులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. కొందరికి ట్వీట్స్‌ లోడింగ్‌ ఫెయిల్‌కాగా, మరికొందరు డెస్క్‌టాప్‌లో లాగ్‌ ఔట్‌ ఎర్రర్స్‌ వచ్చాయి. ట్విటర్‌లో ఏదైనా పోస్ట్‌ చేస్తుంటే ‘మరొకసారి ప్రయత్నించండి’, ‘ఈ సమయంలో ట్వీట్స్‌ను అందించలేకపోతున్నాం. దయ చేసి కొంత సేపటి తర్వాత ప్రయత్నించండి’ అని సందేశాలు వచ్చినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. అయితే, ఈ సమస్య కేవలం డెస్క్‌టాప్‌ వినియోగదారులకు మాత్రమే ఎదురైంది. మొబైల్‌ యాప్‌లో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు.

శనివారం ఉదయం కూడా ట్విటర్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విటర్‌ లాగిన్‌ కాలేకపోయారు. దీనిపై సంస్థ సమాధానం కూడా ఇచ్చింది. ‘మీలో కొందరు ట్వీట్స్‌ లోడింగ్‌లో సమస్య ఎదుర్కొని ఉంటారు. ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరద్ధరిస్తాం’ అని ఈ రోజు ఉదయం ట్విటర్‌ ప్రకటించింది. మళ్లీ సాయంత్రానికి డెస్క్‌టాప్‌ వినియోగదారులు లాగిన్‌ సమస్యను ఎదుర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని