మేకల దొంగలు @కామెడీ సినిమా
సినిమా తీయాలంటే కథ ఉండాలి. దాన్ని తెరపై చూపించడానికి దర్శకుడు కావాలి. కథలోని పాత్రలు పోషించడానికి నటులు కావాలి. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది టెక్నీషియన్లు అవసరం అవుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా వీళ్లందరికీ డబ్బు ఇచ్చి
తమిళనాడులో అన్నాదమ్ముల నిర్వాకం
చెన్నై : సినిమా తీయాలంటే కథ ఉండాలి. దాన్ని తెరపై చూపించడానికి దర్శకుడు కావాలి. కథలోని పాత్రలు పోషించడానికి నటులు కావాలి. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది టెక్నీషియన్లు అవసరం అవుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా వీళ్లందరికీ డబ్బు ఇచ్చి సినిమాను నిర్మించడానికి ఓ నిర్మాత కావాలి. అతను డబ్బు కోసం తనకున్నదాంతోనో.. అప్పు చేయడమో.. లోన్ తీసుకోవడమో మరేతర మార్గాలు ఎంచుకునో నిర్మాణం చేపట్టాలి. కానీ తమిళనాడు చెందిన ఓ వ్యక్తి కామెడీ సినిమా నిర్మించడం ప్రారంభించాడు. డబ్బు లేని కారణంతో సినిమా చిత్రీకరణ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆ వ్యక్తి కొడుకులిద్దరూ వినూత్నంగా ఆలోచించి మేకలను దొంగతనం చేస్తూ వచ్చిన సొమ్మును సినిమా నిర్మాణానికి ఉపయోగించి చివరకు పోలీసులకు చిక్కారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన అన్నాదమ్ములు నిరంజన్‌కుమార్, లెనిన్ కుమార్ల తండ్రి విజయ్‌శంకర్ ఓ వినోదాత్మక సినిమా తీసే క్రమంలో ఆర్థిక అవసరం ఏర్పడింది. అందులో వీళ్లిద్దరూ నటిస్తుండటం.. నిర్మాణానికి డబ్బు అవసరం అవడంతో మేకలను దొంగిలించి వచ్చిన సోమ్మును చిత్రం అవసరాలకు వినియోగించాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆ రాష్ర్టంలోని చెంగల్పట్, మాధవరం, మింజూర్, పొన్నేరి గ్రామీణ ప్రాంతాలను దోపిడీకి లక్ష్యంగా ఎంచుకున్నారు. దొంగతనానికి కారులో వెళ్లే ఈ అన్నాదమ్ములు మేతకు వెళ్లే మేకల గుంపుల్లో రోడ్డు పక్కన ఉండే మేకలను ఒకచోట ఒకటి లేదా రెండు దొంగిలించి కారులో వేసుకొని వెళ్లేవారు. ఇలా ఒక రోజుకు ఎనిమిది నుంచి పది మేకలు దొంగిలించేవారు. ఒక్కో దాన్ని రూ. 8 వేలకు విక్రయించి సినిమా నిర్మాణానికి ఉపయోగించేవారు. ఇలా ఒక మందలో ఒకటి, రెండు మేకలు అదృశ్యమవటంతో వాటి యజమానులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసేవారు కాదు. ఒక వేళ ఫిర్యాదు చేసినా ఇటువంటి కేసులపై పోలీసులు పెద్దగా దృష్టిసారించరని వీళ్లు ధీమాగా ఉండేవారు.
ఇలా వీళ్ల దొంగతనం.. దాంతో వచ్చే డబ్బులతో సినిమా చిత్రీకరణ కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే గత నెల 9వ తేదీ వీరు మాధవరం అనే గ్రామంలో ఒక మేకను దొంగిలించారు. ఇదే వీళ్లను పోలీసులకు పట్టించేలా చేసింది. ఆ మందలో ఆరు మేకలే ఉండటం.. అందులో ఒకటి అదృశ్యమవడంతో వెంటనే గుర్తించిన వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీల ఫుటేజీల ఆధారంగా కారులో వచ్చిన వ్యక్తులు దొంగతనం చేస్తున్నట్లు తేల్చారు. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మేకలు పోయినట్లు పోలీసులు గుర్తించి నిఘా ఉంచారు. ఈ క్రమంలో గత శనివారం అన్నాదమ్ములిద్దరూ మళ్లీ దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కారు. విచారణలో సినిమా దొంగతనం విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు