Andhra News: అమెరికాలో విషాదం.. గుంటూరు జిల్లాకు చెందిన దంపతుల గల్లంతు
అమెరికాలో విహార యాత్రలో విషాదం నెలకొంది. సరస్సు దాటుతున్న క్రమంలో తెలుగు దంపతులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాద ఛాయలు అలముకున్నాయి.
పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదం నెలకొంది. పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలో విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో నివాసం ఉంటూ గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఈ దంపతులు నిన్న ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు. ఓ సరస్సును దాటుతున్న క్రమంలో గల్లంతయ్యారు. హరితను గుర్తించిన రెస్క్యూ సిబ్బంది సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించారు. అయినా.. ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. నారాయణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పాలపర్రులోని వారి తల్లిదండ్రులకు సమాచారమందింది. నిన్న రాత్రి నారాయణ పాలపర్రులోని తండ్రికి ఫోన్ చేసి విహారయాత్రకు వెళ్తున్నామని చెప్పాడని.. ఇంతలోనే ఘోరం జరిగిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నారాయణ, హరిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో కుటుంబంతో కలిసి నారాయణ స్వగ్రామం వచ్చారు. కొద్ది రోజులు బంధువులతో ఆనందంగా గడిపి వెళ్లారని.. ఇంతలోనే దుర్ఘటన జరిగిందని వాపోతున్నారు.
నారాయణ కుటుంబం(పాతచిత్రం)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
S Jaishankar: ‘అది 1962లోనే జరిగింది..’ రాహుల్‌కు జైశంకర్ కౌంటర్
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి
-
Crime News
Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి