Tirumala: తిరుమలలో వైభవంగా ‘ఉగాది ఆస్థానం’

తిరుమలలో ‘ఉగాది ఆస్థానం’ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు.

Updated : 02 Apr 2022 15:48 IST

తిరుమల: తిరుమలలో ‘ఉగాది ఆస్థానం’ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత మళయప్పస్వామికి, శ్రీవారి మూలవిరాట్టుకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని తీసుకుని తితిదే ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో దేశ, కాల పరిస్థితులు, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శుభ‌కృత్‌నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్రహంతో క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డి దేశ వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌ని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని