
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ వ్యవసాయ పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి’’ అని ఆకాంక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.