Ugadi 2022: చిలకమర్తి వారి శుభకృత్‌ నామ ఉగాది పంచాంగ శ్రవణం.. వీక్షించండి

ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అనేకమంది ఏదైనా ముఖ్య కార్యాన్ని తలపెట్టాలంటే ముందుగా శుభ ముహూర్తం చూసుకుంటారు. ఇందుకోసం  అందుబాటులో ఉన్న జ్యోతిష్యులు, పంచాంగకర్తలను.......

Published : 02 Apr 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అనేకమంది ఏదైనా ముఖ్య కార్యాన్ని తలపెట్టాలంటే ముందుగా శుభ ముహూర్తం చూసుకుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న జ్యోతిష్యులు, పంచాంగ కర్తలను సంప్రదిస్తుంటారు. ముహూర్త బలానికి ఉన్న క్రేజ్‌తో వారికి మంచి పరపతి లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగుతో పాటు వివిధ భాషల్లో కూడా పంచాంగాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువ ఇంజినీర్‌, ప్రముఖ పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొలిసారిగా తెలుగు, ఆంగ్ల భాషల్లో దక్షిణ భారతదేశ ఆంగ్ల పంచాంగాన్ని రూపొందించి ప్రత్యేకంగా నిలిచారు. ఆంగ్ల పంచాంగం ప్రత్యేకించి నేటి తరానికి బాగా ఉపయోగపడుతుందని చిలకమర్తి తెలిపారు. పంచాంగం చదవడం ఓ కళ అని, దక్షిణ భారత ఆంగ్ల పంచాంగం... సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నవారికి, కొత్తగా చేరే వారికి, విదేశీ ప్రయాణాలకు, గృహ ప్రవేశాలకు మహూర్తబలం చూసుకునేందుకు మంచి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 

హరిద్వార్‌, రిషికేష్‌ బద్రీనాథ్‌ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించినప్పుడు విదేశీయులు మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల చూపిన ఆసక్తి, విదేశాల్లో ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకుని మన సనాతన ధర్మంలో ఉన్న విషయాల్ని తెలియజేయాలనే సంకల్పంతో ఆంగ్లం, తెలుగులో పంచాంగాలు తీసుకొచ్చినట్టు వివరించారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే...  జ్యోతిష్యం, వాస్తు, నదులు-పుష్కరాలు, యాత్రలు, పూజా విధానంపై  చిలకమర్తి అనేక పుస్తకాలు రాశారు. వీటిని www.chilakamarthi.com, www.southindianastrology.org నుంచి ఉచితంగా పొందొచ్చని తెలిపారు. చిలకమర్తి ఆధ్యాత్మిక కృషిని గుర్తించిన తిరుమల పీఠం... ‘జ్యోతిష్య మార్తాండ’, ‘వాస్తు విద్యా విశారద’ బిరుదులు ప్రదానం చేసింది. దేశంలోని ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక విషయాలపై రచనలు, ప్రవచనాల ద్వారా చేసిన కృషికి రాజమహేంద్రవరంలో జరిగిన సాంస్కృతిక మహోత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. చిలకమర్తి సేవలకు ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  అవార్డుతో సత్కరించారు. విదేశాల్లో జరిగిన పలు ఉగాది వేడుకల్లో ఆయన్ను పురస్కారాలతో సత్కరించారు. శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సందర్భంగా చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి ‘ఈటీవీ వార్తా ఛానెళ్ల’లో చేసిన పంచాంగ శ్రవణం వీక్షించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని