
Study In Abroad: ‘విదేశీ విద్య’లో యూకేకే విద్యార్థుల ఓటు!
ఇంటర్నెట్ డెస్క్: ఏటా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆశిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి పీజీ కోర్సులు, నైపుణ్య కోర్సులు విదేశాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో అత్యధిక మంది విద్యార్థులు యూకేలో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు విదేశీ విద్యకు సహకారం అందించే ‘లీప్ స్కాలర్’ సంస్థ వెల్లడించింది. విదేశీ విద్య కోసం విద్యార్థులు యూకేకి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వడంతో ప్రథమస్థానంలో నిలిచిందని, ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, యూఎస్ ఉన్నాయని పేర్కొంది. ఆ సంస్థకు దరఖాస్తు చేసుకున్న 75వేల మందికిపైగా విద్యార్థుల వివరాలను పరిశీలించగా.. ఈ విషయం వెల్లడైంది.
విద్యార్థుల్లో 49శాతం మంది యూకేకి వెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వగా.. 36శాతం మంది కెనడా, 18శాతం మంది యూఎస్ వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు లీప్ స్కాలర్ తెలిపింది. గతేడాది కరోనా కారణంగా విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం లేకుండాపోయింది. ఈ ఏడాది యూకే గ్రాడ్యూయేషన్ ఇమ్మిగ్రేషన్ విధానం ప్రవేశపెట్టడంతో అక్కడికే వెళ్లాలని విద్యార్థులు ప్రయత్నిస్తున్నారట. కెనడాలో విద్యకు అనువైన వాతావరణం ఉంటుందని ఆ దేశానికి వెళ్తున్నారు.
‘‘2021లో విదేశీ విద్యకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది విద్యార్థుల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశిస్తున్నారు. గొప్ప లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నారు. అలాంటి వారికి మా సంస్థ మద్దతుగా నిలుస్తోంది’’అని లీప్ స్కాలర్ సహా వ్యవస్థాపకుడు వైభవ్ సింగ్ తెలిపారు.
విదేశాల్లో కోర్సుల విషయానికొస్తే.. ఎంబీఏ, ఎంఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్‌కు విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఎంఎస్సీ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి కోర్సులకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.