Tirumala: తిరుమలలో తితిదే ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన ఓ ఎలక్ట్రికల్‌ బస్సు చోరీకి గురైంది.

Updated : 24 Sep 2023 11:55 IST

తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి ఉచిత ధర్మరథం బస్సు చోరీకి గురైంది. ఎవరికీ అంతుచిక్కని విధంగా దుండగుడు పక్క ప్రణాళికతో విద్యుత్ ధర్మరథం బస్సును ఎత్తుకెళ్లాడు. తితిదే రవాణా శాఖ, విజిలెన్స్ వైఫల్యంతో కొండపైన మొదటిసారి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు విద్యుత్ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పరారయ్యాడు.

తిరుమలలో మూడు అంచెల భద్రత ఉన్నట్లు చెప్పే తితిదే.. ఖరీదైన శ్రీవారి ధర్మరథ బస్సులకు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేకపోయింది. శనివారం రాత్రి ఛార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు ఛార్జింగ్ పెట్టి డ్రైవర్ వాహనం వద్ద లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీరా ఉదయం ఛార్జింగ్ స్టేషన్ వద్ద వచ్చి చూడటంతో బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో తితిదే రవాణా శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసుత్తం తిరుమలలో నడుస్తున్న కొత్త విద్యుత్ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉండటంతో.. నాయుడుపేట వద్ద బస్సు ఉందని పోలీసులు గుర్తించారు. దుండగుడు తెల్లవారుజామున 3:53 గంటలకు జీఎన్‌పీ వద్ద ఘాట్ రోడ్డులోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీనిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని