Polavaram: తుది నివేదికకు 3 నెలల సమయం కావాలి: పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ
పోలవరం ముంపుపై సీఎంలు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈనేపథ్యంలో పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కోరింది.
దిల్లీ: పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల పాటు విచారణను వాయిదా వేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకురానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది.
గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. కసరత్తు జరుగుతోందని, తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం అవసరమని పేర్కొంది. ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలని, అవసరమైతే ప్రభావిత రాష్ట్రాల సీఎంలు కూర్చొని మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించుకోవాలని గతేడాది సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా