Published : 06 Jul 2022 22:37 IST

CM Jagan: ఫసల్‌ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం కావాలని ఏపీ సర్కారు నిర్ణయం

అమరావతి: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగస్వామ్యం కావాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రం అమలు చేస్తోన్న వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమాను కేంద్ర ఫసల్‌ బీమా యోజనతో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. పంట నష్టపోయే రైతులకు గరిష్ఠ ప్రయోజనం అందించే చక్కని విధి విధానాలు ఖరారు చేయగానే కేంద్ర పథకంతో భాగస్వామ్యం అవుతామని వెల్లడించారు.

అంతకుముందు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్‌ను సందర్శించిన కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని కేంద్ర బృందం ఈ సందర్భంగా ప్రశంసించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని